తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. వర్షాల ప్రభావాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మానిటరింగ్ చేస్తోందని తెలిపారు. అవసరమైన అన్ని జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. గురువారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తో మాట్లాడిన ఆయన, తాను ఎప్పటికప్పుడు పరిస్థితులను కేంద్రానికి తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు.
కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జాతీయ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, కొన్ని చోట్ల రైల్వేలైన్లు కూడా నష్టపోయాయని తెలిపారు. వీటిని త్వరితగతిన మరమ్మతులు చేసే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
అలాగే హైదరాబాద్ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నగరంలోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్థవ్యస్తంగా ఉందని, వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు నిధుల కొరత వల్ల చిన్న చిన్న పనులు కూడా ఆలస్యమవుతున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Read More : వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం

One thought on “తెలంగాణ వర్షాలపై కిషన్‌రెడ్డి స్పందన.”
Comments are closed.