దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దార్శనికతకు నిదర్శనం. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ దేశ రాజకీయాలపై ప్రభావం చూపగలిగారు,” అని పేర్కొన్నారు. కుల గణన ప్రక్రియను ప్రారంభించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించామని వివరించారు.
కుల గణన అవసరంపై కాంగ్రెస్ పార్టీ యావత్ దేశవ్యాప్తంగా పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. “తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోంది,” అనే వాక్యం ఇప్పుడు మళ్లీ నిరూపితమైందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
Read More : “కేసీఆర్ అసెంబ్లీకి రాలేదెందుకు?”

One thought on “CM – దేశవ్యాప్తంగా కుల గణనపై స్పందన”
Comments are closed.