తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమానికి సహకరించిన కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, మహిళలు, రాజకీయ నాయకులతో పాటు పలువురికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
“తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టేలా భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు సాగుతాం,” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్లు పూర్తి చేసుకుని పన్నెండవ వసంతంలోకి అడుగుపెడుతుందన్న ఆయన, ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను గౌరవంగా స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాం. అదే స్పూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారాయన.

One thought on “Telangana Formation Day:తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ప్రముఖుల శుభాకాంక్షలు”
Comments are closed.