సిరిసిల్ల వరద ప్రాంతంలో కేటీఆర్–బండి సంజయ్ ఆప్యాయ కలయిక

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాలు వరద ముప్పులో ఉన్నాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని, పెద్ద ఎత్తున ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండలంలో ఈ ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడి ఆప్యాయంగా పలకరించుకున్నారు.

అదే సమయంలో, వరద పరిస్థితులపై కేటీఆర్ స్వయంగా బండి సంజయ్‌కు వివరాలు అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More : బండి సంజయ్: కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.

One thought on “సిరిసిల్ల వరద ప్రాంతంలో కేటీఆర్–బండి సంజయ్ ఆప్యాయ కలయిక

Comments are closed.