2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించిన నిందితుడు తహావూర్ హుస్సేన్ రానాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. అధికార వర్గాల ప్రకారం, రానాను తరలించిన విమానం ఢిల్లీలోని పాలమ్ భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయింది.
పాకిస్తాన్‌లో జన్మించి, ప్రస్తుతం కెనడా పౌరసత్వం కలిగిన రానా, 26/11 ఉగ్రదాడులకు సంబంధించి పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ దాడుల్లో 170 మందికిపైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తహావూర్ రానా తరలింపుతో కేసు దర్యాప్తులో కీలక మలుపు రానుందని, అతడిని అదుపులోకి తీసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.
NIA అధికారులు త్వరలోనే రానాను అరెస్ట్ చేసి విచారణ చేపట్టనున్నారు. 26/11 బాధితులకు న్యాయం జరిగేలా తహావూర్‌పై కఠినమైన న్యాయ ప్రక్రియ కొనసాగనుంది.
Read More : జైపూర్‌లో దారుణం: సామూహిక పెళ్లిళ్ల పేరిట బాలికల అమ్మకాలు!
