తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) ఈ విషయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) సందర్భంగా మార్చి 8న సికింద్రాబాద్ (Secunderabad) పరేడ్ మైదానంలో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో 14,236 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ పోస్టుల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో 6,399 అంగన్వాడీ టీచర్ (Anganwadi Teacher) పోస్టులు, 7,837 హెల్పర్ (Helper) పోస్టులు ఉన్నాయి.
అర్హతలు & వయోపరిమితి
ఈ ఉద్యోగాలకు కనీసం ఇంటర్మీడియట్ (Intermediate) ఉత్తీర్ణత తప్పనిసరి. అలాగే 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగిన వివాహిత (Married Women) మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
తెలంగాణ లాసెట్ 2025 (Telangana LAWCET 2025)
తెలంగాణ లాసెట్ (LAWCET) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. మార్చి 1వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జూన్ 6వ తేదీన తెలంగాణ లాసెట్ (Telangana LAWCET) & పీజీఎల్‌సెట్ (PGLCET) పరీక్షలు నిర్వహించనున్నారు.

2 thoughts on “తెలంగాణలో 14 వేల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”
Comments are closed.