తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు షాక్

అమెరికా అధికారులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థుల విద్యా వీసా దరఖాస్తులను భారీగా తిరస్కరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ రెండు రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసిన విద్యార్థుల్లో సగానికి పైగా వీసా తిరస్కరణకు గురవుతున్నారు.

హైదరాబాద్‌లోని విదేశీ విద్యా సలహాదారుల ప్రకారం, గత 20 ఏళ్లలో ఇదే అత్యధిక వీసా తిరస్కరణ రేటుగా నమోదైందని తెలిపారు. వీసా రిజెక్షన్ రేటు పెరగడంతో అమెరికాలో చదవాలని ఆశిస్తున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Read More : హెచ్‌సీయూ ప్రొఫెసర్లు భూమి అంశంపై స్పందన, ఇందిరా గాంధీ ఆశయాలను ఆవహించకూడదని కోరిన వారు….