బీసీలకు అన్యాయం అంటూనే, బీసీ నేతలపై దాడి
రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం పోరాడే నేతలను అణచివేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో విమర్శించారు. బీసీలను కించపరిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంగా హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీల కోసం గ్రామ గ్రామానికి వెళ్లి తమ వాదాన్ని ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు.
కులగణన పత్రాల తగులబెడితే సస్పెండ్ చేస్తారా?
కులగణన ప్రక్రియను తప్పుబడుతూ తాను నిరసన తెలియజేయగా, కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేసిందని మల్లన్న ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి తీసుకొచ్చి తనను పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు చూపి బహిష్కరించారని పేర్కొన్నారు. అయితే, తన సస్పెన్షన్‌తో బీసీ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
2028లో బీసీ ముఖ్యమంత్రి ఖాయం
బీసీల జనాభా తగ్గింపునకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించిన మల్లన్న, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రక్షణ కోసమే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆరోపించారు. 2028 నాటికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌ను బతకాలనుకుంటున్నా – ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయను
తనపై ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ బతకాలని కోరుకుంటున్నప్పటికీ, పార్టీ తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టారు. సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు వట్టే జానయ్య యాదవ్, సంగెం సూర్యారావు, పి. సత్యం వంశరాజ్, గటిక విజయ్‌కుమార్, ఓదేలు యాదవ్, రజని తదితరులు పాల్గొన్నారు.

One thought on “ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు**”
Comments are closed.