తమిళనాడులో ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు మరో అడుగు ముందుకు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎయిర్ కండిషన్డ్ బస్ టెర్మినల్‌ను పంజాపూర్‌లో ప్రారంభించింది. ఇది తమిళనాడులోనే కాకుండా, దక్షిణ భారతదేశంలోనూ అతి పెద్ద ఆధునిక బస్ టెర్మినస్‌గా నిలిచింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ టెర్మినల్ అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంది. ఇందులో సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ, ప్రయాణికుల కోసం విశాలమైన వేటింగ్ హాల్స్, ఆధునిక టికెట్ బుకింగ్ కౌంటర్లు, ఫుడ్ కోర్టులు, స్వచ్ఛమైన టాయిలెట్లు, 24 గంటల సీసీ కెమెరా పర్యవేక్షణ వంటి సదుపాయాలు ఉన్నాయి.
ఈ టెర్మినస్ నిర్మాణం ద్వారా ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన, భద్రతతో కూడిన ప్రయాణ అనుభవం లభించనుందని అధికారులు తెలిపారు. పంజాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం తమిళనాడులోని అనేక ప్రధాన పట్టణాలకు కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు ట్రాఫిక్ ఒత్తిడిని కూడా తగ్గించనుంది.
ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పర్యావరణ అనుకూలంగా కూడా రూపొందించింది. అందులో భాగంగా సౌర శక్తిని వినియోగించే చర్యలు తీసుకోగా, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం పూర్తయింది. రాష్ట్ర ప్రజలకు నూతన ప్రయాణ అనుభవం అందించడంలో ఈ టెర్మినల్ కీలక పాత్ర పోషించనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More : మోదీపై ఖర్గే విమర్శలు: మణిపూర్‌కి ఎందుకు రాలేరు?
