తమిళనాడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. చెన్నైలో డెలివరీ పార్ట్‌నర్ల కోసం ప్రత్యేక ఏసీ విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం దేశంలో తొలిసారిగా అమలు కావడం గమనార్హం.
ఈ విశ్రాంతి కేంద్రాల్లో డెలివరీ బాయ్స్ తమ పనుల మధ్య విరామం తీసుకునేందుకు అనువైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో విశ్రాంతి కోసం కూర్చునే సీట్లు, తినేందుకు ఏర్పాట్లు, మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం, టాయిలెట్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
డెలివరీ పార్ట్‌నర్ల శ్రమను గుర్తించి, వారి ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇలాంటి సేవలు అందించిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.
Read More : ఎయిర్ ఇండియా ప్రమాదంలో : స్పష్టమైన వివరాలు

One thought on “డెలివరీ బాయ్స్ కోసం తమిళనాడులో ఏసీ విశ్రాంతి కేంద్రాలు”
Comments are closed.