ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ భారత్‌లో సాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ స్టార్‌లింక్‌కు అవసరమైన లైసెన్స్‌ను మంజూరు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. స్టార్‌లింక్ సర్వీసులు దేశవ్యాప్తంగా దూరప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించేందుకు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా కనెక్టివిటీ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ఈ సర్వీసులు పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని నిపుణులు భావిస్తున్నారు.
గత కొంతకాలంగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు స్టార్‌లింక్ ప్రయత్నిస్తుండగా, అనుమతుల మంజూరుతో ఆ మార్గం సుగమమైంది. త్వరలోనే దేశంలో వాణిజ్య సర్వీసులు ప్రారంభించేందుకు స్టార్‌లింక్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయం గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణకు దోహదం చేయడమే కాకుండా, భారత్‌లో డిజిటల్ కనెక్టివిటీ పెంపుకు కీలకంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Read More : రూ.1000 కోట్ల మోసం కేసులో తమిళ నటుడు అరెస్ట్

2 thoughts on “సాటిలైట్ ఇంటర్నెట్ విప్లవం ప్రారంభమవుతుందా?”
Comments are closed.