ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘SSMB 29’కు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. కెన్యా విదేశాంగ శాఖ మంత్రి ముసాలియా ముదావడి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆఫ్రికాలో జరిగిన షూటింగ్ షెడ్యూల్ పూర్తవడంతో చిత్రబృందం భారత్‌కు తిరిగి బయలుదేరిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయతో పాటు చిత్ర ప్రతినిధులతో కలిసి దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
కెన్యా వేదికగా ఈ షూటింగ్ జరగడం పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేస్తూ, “ప్రపంచ సినీ రంగంలో అగ్రగామి దర్శకుడు రాజమౌళికి గత రెండు వారాలుగా కెన్యా ఆతిథ్యం ఇచ్చింది. అద్భుతమైన కథనాలు, విశిష్టమైన విజువల్స్‌తో ఆయన ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు” అని ప్రశంసించారు. ఆసియాలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థ తమ దేశాన్ని ప్రధాన లొకేషన్‌గా ఎంచుకోవడం గర్వకారణమని తెలిపారు. తూర్పు ఆఫ్రికా పలు దేశాల్లో పరిశీలన చేసిన అనంతరం, చివరికి కెన్యానే ప్రధాన షూటింగ్ ప్రదేశమైందని మంత్రి వెల్లడించారు. సినిమాలోని ఆఫ్రికా సన్నివేశాల్లో దాదాపు 95 శాతం చిత్రీకరణ మసాయ్ మారా, నైవాషా, సంబురు, అంబోసెలీ వంటి అందమైన ప్రదేశాల్లో జరిగిందని ఆయన వివరించారు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో విడుదల కానుందని ముదావడి ప్రకటించారు. ఇది సినిమా చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని, కెన్యా సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Read More : రజనీకాంత్ ‘కూలీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ.
One thought on “మహేశ్ బాబు–రాజమౌళి ‘SSMB 29’ కెన్యా షెడ్యూల్ పూర్తి.”
Comments are closed.