శ్రీలీలకు సిక్కిం సీఎం నుంచి ప్రత్యేక బహుమతి – కారణం ఏంటో తెలుసా?

Sreeleela Special Gift from Sikkim CM

ఇటీవల పుష్ప 2 సినిమాలో “కిస్సిక్” స్పెషల్ సాంగ్‌తో యువతను కట్టిపడేసిన శ్రీలీల, ఇప్పుడు నితిన్ హీరోగా నటించిన “రాబిన్ హుడ్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో, ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించారు. ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ రివ్యూలు తెచ్చుకుంది. వరుస పరాజయాలు ఎదురైనా, శ్రీలీల క్రేజ్ మాత్రం తగ్గలేదు. బాలీవుడ్‌లోనూ ఈ అందాల తారకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అనురాగ్ బసు దర్శకత్వంలో, స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సిక్కింలో జరుగుతోంది.

తాజాగా, సిక్కింలో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న అనురాగ్ బసు, కార్తీక్ ఆర్యన్, శ్రీలీల తదితరులు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. సినిమా చిత్రీకరణ కోసం సిక్కింను ఎంచుకున్నందుకు చిత్రబృందానికి ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కార్తీక్ ఆర్యన్, శ్రీలీల, అనురాగ్ బసుకు ప్రత్యేక బహుమతులు అందించారు. సినిమా షూటింగ్ ముగిసే వరకు ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను సిక్కిం సీఎంఓ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ముఖ్యమంత్రితో కలసిన సందర్భంగా సిక్కిం సంస్కృతి, ఆతిథ్యం మీద టీమ్ ఎంతో ముచ్చటించుకుందట. శ్రీలీలకు అందిన ఈ ప్రత్యేక గిఫ్ట్ గురించి తెలిసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More

One thought on “శ్రీలీలకు సిక్కిం సీఎం నుంచి ప్రత్యేక బహుమతి – కారణం ఏంటో తెలుసా?

Comments are closed.