తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ, బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా, టాలీవుడ్‌లో మాత్రం అంతటి స్టార్‌డమ్ దక్కించుకోలేదు. గతేడాది నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు సెన్సేషనల్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. రంజిత్ సినిమాలు విశిష్టమైన కథనంతో, విభిన్నమైన క్యారెక్టర్‌లతో ప్రసిద్ధి పొందాయి.
ప్రస్తుతం రంజిత్ రూపొందిస్తున్న “వెట్టువన్” చిత్రంలో దినేష్ హీరోగా, ఆర్య విలన్‌గా, అశోక్ సెల్వన్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో శోభిత హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. పా. రంజిత్ చిత్రాల్లో నటించే వారికి మంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంటుందని పరిశ్రమలో పేరు. రంజిత్, పాత్రకు పూర్తిగా సరిపడే నటీనటులను మాత్రమే ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే, శోభిత తన టాలెంట్‌ను ప్రదర్శించి స్టార్‌డమ్ సంపాదించుకునే చాన్స్ కలిగించుకుంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ సినిమాను గోల్డెన్ రేమ్స్‌తో కలిసి నీలం ప్రొడక్షన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 2022లోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇప్పుడు చివరికి షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మరోవైపు, పెళ్లి తర్వాత నాగ చైతన్య తన “తండేల్” చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు శోభిత కూడా రంజిత్ సినిమాలో నటించి అదే స్థాయిలో సక్సెస్ అందుకుంటుందా అన్న ఆసక్తి పెరుగుతోంది.

One thought on “శోభితకు పా. రంజిత్ నుంచి బంపరాఫర్!”
Comments are closed.