అక్కినేని కోడలు శోభిత ధూళిపాల తన ఫ్యాషన్ స్టేట్మెంట్‌తో మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. ప్రతిసారి లాగా ఈసారి కూడా కొత్తదనంతో నిండిన డిజైనర్ లుక్‌తో యువతను మంత్రముగ్ధం చేసింది. ప్రత్యేకమైన ఎంపికలతో శోభిత పోటీ నాయికలకు సవాల్ విసురుతోంది.
తాజాగా ఆమె ధరించిన థై-స్లిట్ డిజైనర్ ఫ్రాక్ బంగారు రంగులో మెరుపులు ప్రసరిస్తూ, నెమలి పించాల డిజైన్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నడుచుతున్నప్పుడు శోభిత నెమలిని తలపించినట్లు చూపుల్ని కట్టిపడేస్తోంది. ఆమె లుక్‌ను చూసినవారు ‘బంగారు నెమలి’ అంటూ మంత్రముగ్ధులు అవుతున్నారు.

ఈ ఫొటోలకు శోభిత ఇచ్చిన క్యాప్షన్ మరింత ఆకట్టుకుంది. “గోల్డెన్ అవర్.. కానీ దానిని కోచర్‌గా చేసుకోండి” అంటూ తాను ఎంపిక చేసుకున్న లుక్‌ను శబ్దాల సమ్మేళనంగా వివరించింది. ప్రకృతి, పక్షుల నుంచి స్పూర్తి పొందిన ఈ డిజైనర్ ఫ్రాక్ ప్రత్యేకమైన ఫ్యాషన్ స్టేట్మెంట్‌గా నిలిచింది.

ప్రస్తుతం శోభిత సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్‌పై దృష్టి సారించింది. మంకీ మ్యాన్, జిగ్రా వంటి చిత్రాల తర్వాత కొత్త ప్రాజెక్టులు ప్రకటించలేదు. మరోవైపు నాగచైతన్య వరుస విజయాలతో తన కెరీర్‌ను దూసుకుపోతున్నాడు.


One thought on “గోల్డెన్ గ్లోరిలో శోభిత ధూళిపాల: అక్కినేని కోడల లేటెస్ట్ స్టన్నింగ్ అవతారం”
Comments are closed.