ప్రముఖ గాయని కల్పన ఆరోగ్య పరిస్థితి తాజాగా చర్చనీయాంశంగా మారింది. నిద్రమాత్రల అధిక మోతాదుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కల్పన కుమార్తె దయ ఈ విషయంపై స్పందిస్తూ, ఆమె ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టం చేశారు. ఇన్సోమ్నియాతో బాధపడుతున్న కారణంగా డాక్టర్లు కొన్ని మందులు సూచించారని, ఆ మోతాదు ఎక్కువై అపస్మారక స్థితిలోకి వెళ్లారని తెలిపారు. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవని, తల్లిదండ్రుల మధ్య విబేధాలు అంటూ ప్రచారమవుతున్న వార్తలు అసత్యమని అన్నారు. ప్రస్తుతం కల్పన LLB, పీహెచ్డీ చదువుతున్నారని, ఆమె త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని వివరించారు.
ఎమర్జెన్సీ పరిస్థితి:
కల్పన హైదరాబాద్ KPHBలోని తన నివాసంలో ఉండగా మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి మత్తుగా అనిపిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆయన వెంటనే స్థానికులకు సమాచారం అందించగా, వారు పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు ఇంటికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉండటం గమనించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
వైద్యుల ప్రకారం, కల్పన ఊపిరితిత్తుల్లో నీరు చేరిన కారణంగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు.

One thought on “Singer Kalpana Health Update: ఆస్పత్రిలో చికిత్స”
Comments are closed.