తాము తల్లిదండ్రులవుతున్న ఆనందంలో ఉన్న సిద్ధార్థ్ మరియు కియారా, ఇటీవల డాక్టర్‌ను కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుడిని కలవడానికి వెళ్లిన ఈ జంటను పాపారాజీలు గుర్తించి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా సిద్ తన భార్యను రక్షిస్తూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.
సిద్ధార్థ్ కాస్త కూల్ లుక్‌లో కనిపించగా, కియారా పింక్ కుర్తీలో అందంగా మెరిసింది. ఆసుపత్రి సందర్శన అనంతరం కారులో కూర్చొన్న కియారాను గమనించిన ఫోటోగ్రాఫర్లు ఆమెపై లైట్లు వేయడం సిద్ధర్థ్ కు కోపం తెప్పించింది. “బిహేవ్ యార్, ఒక నిమిషం… వెనక్కి వెళ్లండి” అంటూ ఆయన వారిని హెచ్చరించారు.
కొంతకాలం క్రితం సోషల్ మీడియా ద్వారా ఈ జంట తాము తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించగా, సినీ ప్రముఖులు భారీగా శుభాకాంక్షలు తెలియజేశారు. కృతి ఖర్బందా రాధికా మదన్, ఏక్తా కపూర్ వంటి వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ క్యూట్ కపుల్‌కు అభిమానుల నుంచి ప్రేమ వెల్లువెత్తింది.
ప్రస్తుతం సిద్ధార్థ్ “పరమ్ సుందరీ” అనే సినిమాతో బిజీగా ఉండగా, కియారా “వార్ 2″లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు. తల్లిదండ్రులుగా మారే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రేమతో సాగిస్తున్నారు. మరోవైపు కుటుంబ జీవితం – ఈ జంట అందరికి ఆదర్శంగా నిలుస్తోంది.

One thought on “గర్భవతిగా ఉన్న కియారా కోసం సిద్ జాగ్రత్తగా – మీడియా ఫోటోగ్రాఫర్లు పై ఆగ్రహం వ్యక్తం”
Comments are closed.