యువ నటుడు కార్తీకేయ దేవ్ “గుడ్ బ్యాడ్ అగ్లీ” చిత్రంలో అజిత్ కుమార్ రీల్ లైఫ్ కొడుకుగా నటించి ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈ చిత్రంతో పాటు, ఆయన తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. “సలార్” చిత్రంలో చిన్న పాత్రతో ప్రశంసలు పొందిన కార్తీకేయా, “ఎంపురాన్” చిత్రంలో కూడా కీలక పాత్రలో కనిపించి తన ప్రతిభను చూపించాడు.
కార్తీకేయా దేవ్ ఇటీవల “టక్ టక్” అనే ఫాంటసీ కామెడీ డ్రామాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో అతనితో పాటు పలువురు నటులు కూడా మెప్పించారు. ప్రతి సినిమా ద్వారా తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ, సౌతిండియా చిత్రసీమలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు.
అజిత్ కుమార్‌తో పనిచేసే అనుభవాన్ని కార్తీకేయా గర్వకారణంగా పేర్కొన్నాడు. ఆయన వృత్తి పట్ల చూపిన నిబద్ధత, జ్ఞానం, మరియు చిత్రబృందంపై ఆయన చూపించిన గౌరవం తనపై తీవ్రమైన ప్రభావం చూపిందని కార్తీకేయా తెలిపారు. “అజిత్ సార్‌తో గడిపిన ప్రతి క్షణం మాకు గొప్ప అనుభవంగా మారింది” అని పేర్కొన్నాడు.

One thought on “అజిత్ కుమార్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న యువ నటుడు కార్తీకేయ దేవ్ ఎవరు?”
Comments are closed.