సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బుధవారం ఓ పెట్రోల్ బంక్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బైక్కు ఇంధనం నింపుతున్న సమయంలో ఒక్కసారిగా పెట్రోల్ పైపు నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాహనదారుడు వెంటనే పెట్రోల్ నింపుతున్న పైపును కింద వేయడంతో మంటలు మరింత వ్యాపించకుండా నివారించగలిగారు. అనంతరం బంకులోని సిబ్బంది స్పందనతో వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బంక్ సిబ్బంది సకాలంలో జోక్యం చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.
Read More : Mahabubnagar : అటవీ శాఖ హుటాహుటిన రంగంలోకి

One thought on “సిద్దిపేటలో పెను ప్రమాదం తప్పిన ఘటన”
Comments are closed.