స్టార్ హీరో ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గొప్ప శాస్త్రవేత్త, ఇంజనీర్ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌లో టాలీవుడ్ నటి శివానీ రాజశేఖర్‌కు గోల్డెన్ ఛాన్స్ లభించింది. ఈ చిత్రంలో శివానీ ఒక కీలక పాత్రను పోషించనుండగా, జూన్ నుండి షూటింగ్‌లో పాల్గొననున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె, ఈ బయోపిక్‌తో తన కెరీర్‌లో మరొక మైలురాయిని అందుకోనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కోయంబత్తూర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు, చదువుకు పెద్దగా ఆసక్తి చూపకపోయినా, తన పరిశోధనలతో ఎన్నో సాంకేతిక ఆవిష్కరణలకు మూలస్తంభంగా నిలిచారు. ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ మోటార్‌ను కనుగొన్న ఆయన, స్వయంగా అనేక ప్రయోగాలు చేస్తూ “మిరాకిల్ మ్యాన్”, “ఇండియన్ ఎడిసన్”గా పేరు తెచ్చుకున్నారు. హోటల్ సర్వర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించినా, పరిశోధనల పట్ల ఆసక్తితో విజ్ఞాన రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
గతంలో “రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్” చిత్రంతో నంబి నారాయణన్ బయోపిక్‌ను తెరకెక్కించి, నటించి, జాతీయ అవార్డు అందుకున్న మాధవన్, ఇప్పుడు జీడీ నాయుడు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రియమణి, యోగిబాబు, జయరాం వంటి కీలక నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ నుంచి శివానీ రాజశేఖర్ ఈ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.
One thought on “శివానీకి సూపర్ ఛాన్స్ – మాధవన్ బయోపిక్‌లో కీలక పాత్ర”
Comments are closed.