ఫోన్ ట్యాపింగ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

ys

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నిజమేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 2018-19లో కేసీఆర్ తెలంగాణ సీఎం, జగన్ ఏపీ సీఎంగా ఉన్న సమయంలో వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేశారు. అదే సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక జాయింట్ ఆపరేషన్‌గా సాగిందని ఆరోపించారు.

వైఎస్ షర్మిల మాట్లాడుతూ – తన ఫోన్, భర్త ఫోన్ ట్యాప్ అవుతున్నాయన్న విషయం అప్పుడే అర్థమైందని చెప్పారు. వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి స్వయంగా వచ్చి ట్యాపింగ్ జరుగుతోందని తనకు చెప్పారు. తమ ఫోన్ సంభాషణలు తానే వినిపోయినట్టు తెలిపారు. దీనిపై సుబ్బారెడ్డి ఒప్పుకుంటారా అన్నది తనకూ అనుమానమేనని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వినిపించిందంటే ఇది పూర్తిగా అక్రమం అని స్పష్టం చేశారు.

తన రాజకీయ భవిష్యత్తు నాశనం చేసేందుకే ఈ ట్యాపింగ్ జరిగిందని విమర్శించారు. తనకు మద్దతుగా నిలిచినవారిని కూడా బెదిరించారన్నారు. జగన్ తన ఊపిరి తీసుకోవడానికే అవకాసం ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అప్పట్లో పోరాటం చేయలేకపోయానని, కానీ ఇప్పుడు ఏదైనా విచారణకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

బైబిల్ మీదా, తన పిల్లల మీద ప్రమాణం చేసి నిజం చెబుతానన్నారు. ఏదైనా విచారణ జరిగితే సహకరిస్తానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి విమానంలో విశాఖ చేరుకున్న వైఎస్ షర్మిల, అనంతరం రోడ్డుమార్గంలో అరకు వెళ్లనున్నారు. విలేకర్లతో మాట్లాడిన ఆమె వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.

Read More : గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రమాదం

One thought on “ఫోన్ ట్యాపింగ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

Comments are closed.