రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాణాలు బలిగొట్టింది. షాద్‌నగర్ చౌరస్తా వద్ద ట్యాంకర్ బైక్‌ను ఢీకొనడంతో తండ్రి, ఇద్దరు కూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.
మృతుల్లో ఒకరు బీటెక్ విద్యార్థిని మైత్రి. ప్రమాదం సమయంలో “నన్ను కాపాడండి” అంటూ ఆమె చేసిన ఆర్తనాదం అక్కడ ఉన్నవారిని కలచివేసింది. సమాచారం మేరకు, తండ్రి తన కూతురు మైత్రిని శంషాబాద్‌లోని వర్ధమాన్ కాలేజీకి పంపించేందుకు బస్ స్టాండ్‌కి తీసుకువెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన షాద్‌నగర్ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Read More : CM పై బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఫైర్

One thought on “షాద్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం”
Comments are closed.