హైదరాబాద్‌కు సమీపంలోని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రంగనాయకులగుట్టకు చెందిన 13 సంవత్సరాల మైనర్ బాలిక ఒకరు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు పంపిస్తూ ఇంటర్ చదువుతున్న రోహిత్ అనే యువకుడు బాలికను తీవ్రంగా వేధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వేధింపులు తట్టుకోలేక బాలిక కుటుంబం రెండు రోజుల క్రితం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు సరైన స్పందన ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోహిత్ మళ్లీ బాలికను బెదిరించినట్టు తెలుస్తోంది. తీవ్ర మనోవేదనలో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
తన కూతురు మరణానికి పోలీసులు బాధ్యత వహించాలని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి వచ్చిందని బాలిక తల్లిదండ్రులు ఆవేదనతో తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమాజం డిమాండ్ చేస్తోంది.
Read More : హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు
