మీటూ ఉద్యమ ప్రభావంతో పలువురు నటిమణులు గతంలో ఎదురైన వేధింపుల విషయాలను తెరపైకి తీసుకువస్తున్నారు. తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటించిన సయామీ ఖేర్ తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక విషాదానుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
ఒక ప్రముఖ బాలీవుడ్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన వయసు 19-20 సంవత్సరాల సమయంలో ఓ అవకాశం కోసం ప్రయత్నించగా, ఒక మహిళా కాస్టింగ్ ఏజెంట్ ఆశ్చర్యకరమైన అభ్యర్థన చేసిందని వెల్లడించారు.
ఆ దర్శకుడు కమిట్‌మెంట్ ఇవ్వాలని చెప్పినట్టు ఆ మహిళా ఏజెంట్ తనకు తెలిపిందని, ఇది తనను షాక్‌కు గురి చేసిందన్నారు. “ఒక మహిళ ఇంకొక మహిళతో ఇలాంటివి మాట్లాడటం బాధ కలిగించింది. నేను అప్పుడే చెప్పాను.. అర్థం కావడం లేదు, ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి అని. కానీ ఆమె మాత్రం – ‘మీరు అర్థం చేసుకోవాలి’ అని సూచించింది. నేను ఆ మార్గాన్ని ఎప్పటికీ అంగీకరించను” అని స్పష్టం చేశారు.
సయామీ ఖేర్ అయితే ఏజెంట్ లేదా డైరెక్టర్ పేర్లను వెల్లడించకపోయినా, తనను అలాంటి పరిస్థితిలోకి నెట్టిన బాధను వ్యక్తపరిచారు.
సయామీ 2015లో తెలుగు సినిమా ‘రేయ్’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టగా, 2016లో ‘మిర్జ్యా’తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఆమె ‘మౌళి’, ‘చోక్డ్’, ‘వైల్డ్ డాగ్’, ‘ఘూమర్’ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే ‘స్పెషల్ ఓప్స్’, ‘ఫాదు’ వంటి వెబ్‌సిరీస్‌లలో కూడా నటించారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ చర్చను మళ్లీ హాట్ టాపిక్‌గా మార్చాయి.
Read More : తన కొత్త సినిమా కోసం శ్రమిస్తున్న రాశీ ఖన్నా

One thought on “లైంగిక వేధింపుల గురించని అద్భుతమైన నిజాలు.”
Comments are closed.