ప్రముఖ నటి రాశీ ఖన్నా తన తాజా సినిమా కోసం ఎంతగా శ్రమిస్తున్నారో చూపిస్తూ, సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలలో ఆమె ముఖంపై, చేతులపై గాయాలతో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.
సాధారణంగా కనిపించే టీ-షర్ట్, నల్లటి ప్యాంటులో కనిపించిన రాశీ, తీవ్ర శారీరక శిక్షణలో పాల్గొన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. “కొన్ని పాత్రలు అడగవు… అవి డిమాండ్ చేస్తాయి. మీ శరీరాన్ని, శ్వాసను, గాయాలను కూడా కోరుకుంటాయి. మీరు తుపానులా మారినప్పుడు, ఉరుములు పిడుగులు లెక్కకాదుగా… త్వరలో వస్తోంది…” అని ఆసక్తికర క్యాప్షన్ జత చేశారు.
ఈ ఫోటోలు ఆమె కొత్త ప్రాజెక్ట్ కోసం ఫిజికల్ ట్రైనింగ్, యాక్షన్ సన్నివేశాలు ఎంతగా ప్రిపేర్ అవుతున్నారో వెల్లడిస్తున్నాయి. అభిమానులు ఈ పోస్ట్‌పై విశేషంగా స్పందిస్తున్నారు.
ఇటీవల రాశీ ఖన్నా, గోద్రా రైలు దహన ఘటన ఆధారంగా రూపొందిన పొలిటికల్ డ్రామా “ది సబర్మతి రిపోర్ట్” లో జర్నలిస్టు పాత్రలో నటించారు. ఇందులో విక్రాంత్ మాస్సే, రిద్ది డోగ్రా కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుతం రాశీ ఖన్నా, తెలుగులో సిద్దు జొన్నలగడ్డతో కలిసి ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తుండగా, హిందీలో TME అనే యాక్షన్ డ్రామా సినిమాతో పాటు ఫర్జీ 2 వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తున్నారు.
Read More : సినీ సంగీత దర్శకుడు కీరవాణి – DCM

2 thoughts on “తన కొత్త సినిమా కోసం శ్రమిస్తున్న రాశీ ఖన్నా”
Comments are closed.