అల్లరి నరేష్ ప్లేస్‌ను భర్తీ చేస్తున్న సంగీత్ శోభన్?

Sangeeth Shobhan replacing Allari Naresh

ఈవీవీ కుటుంబం నుంచి వచ్చిన వారిలో ఆర్యన్ రాజేష్‌ కన్నా అల్లరి నరేష్‌ పెద్ద స్టార్ అవుతాడని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఫలితం అలా రాలేదు. ఆర్యన్ కంటే నరేష్‌ నటనతో మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా కమెడియన్ హీరోగా వరుస విజయాలతో అతడి కెరీర్ పరుగులు పెట్టింది. అయితే, ఒక దశనుంచి నరేష్ కామెడీ ట్రాక్ రొటీన్‌గా మారింది. అందువల్ల విజ‌యాల వెన‌క‌డుగు ప‌డింది. అదే సమయంలో నరేష్ కొత్త తరహా పాత్రలపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు.

ఈ మధ్య యాక్షన్ పాత్రలు, విభిన్న కథలతో నరేష్ ప్రయోగాలు చేస్తూ కనిపిస్తున్నాడు. కానీ మళ్లీ పూర్తిస్థాయిలో బ్రేక్ మాత్రం రాలేదు. కామెడీకి నో చెప్పనన్నా, ఇప్పటి ట్రెండ్‌లో ఆ పాత ఫార్ములా వర్కౌట్ కావడం లేదు. ఈ పరిస్థితిలోనే ‘MAD’ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన సంగీత్ శోభన్ వరుస విజయాలతో యూత్‌ఫుల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా హిట్ కావడంతో సంగీత్‌కి సోలో హీరోగా మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పాలి.

ఇటీవల మెగా వారసురాలు నిహారిక కూ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నారంటే, సంగీత్ హవా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అతని కామెడీ టైమింగ్‌కి స్పెషల్ స్క్రిప్ట్స్ రాసుకుంటున్నారు. ఇది చూస్తుంటే కొంతకాలం పాటు అల్లరి నరేష్ స్థానాన్ని సంగీత్ భర్తీ చేసేలా కనిపిస్తోంది. అతడి అన్న సంతోష్ శోభన్ కూడా హీరోగానే ఉన్నా, ప్రస్తుతానికి సంగీత్ దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఈ అన్నదమ్ముల కథ కూడా అల్లరి నరేష్ – ఆర్యన్ రాజేష్ ల స్టోరీలాగే తిరుగుతుందా? అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.

Read More

One thought on “అల్లరి నరేష్ ప్లేస్‌ను భర్తీ చేస్తున్న సంగీత్ శోభన్?

Comments are closed.