ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’తోనే టాలెంట్‌ను నిరూపించుకున్న నాగి, తర్వాత ‘మహానటి’తో తన డైరెక్షన్‌కు నూతన మైలురాయిని నిలిపారు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘కల్కి 2898 ఏ.డి’ లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను తెరకెక్కించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
ఇప్పటికే కల్కి చిత్రం భారీ హిట్‌గా నిలిచి, రూ.1000 కోట్ల మార్కును దాటి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అభిమానులు కల్కి2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల తిరుమల ఆలయాన్ని దర్శించుకున్న నాగ్ అశ్విన్‌ను ఫ్యాన్స్ చుట్టుముట్టగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ “కల్కి 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. షూటింగ్ ఈ సంవత్సరం చివర్లో ప్రారంభం కావచ్చు” అని స్పష్టత ఇచ్చారు.
ఇక నాగ్ అశ్విన్ తన సామాజిక బాధ్యతను కూడా నిరూపిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని అడవిని తొలగించే ప్రభుత్వ యోజనపై స్పందించిన ఆయన, వన్యప్రాణులకు నష్టం కలగకుండా అభివృద్ధి సాధ్యం కావాలన్నారు. అభివృద్ధి అవసరమైన చోటే జరగాలి కానీ ప్రకృతిని నాశనం చేయకూడదన్నది ఆయన స్పష్టమైన అభిప్రాయం.

One thought on “ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న కల్కి 2పై నాగ్ అశ్విన్ తాజా అప్డేట్”
Comments are closed.