సనత్ నగర్ జనప్రియ అపార్ట్‌మెంట్‌లో మహిళ ఆత్మహత్య

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జనప్రియ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి ఒక మహిళ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఇప్పటికే విచారణ చేపట్టినట్లు సమాచారం. ఘటన స్థానంలో ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరించగా, అపార్ట్‌మెంట్ వాసుల్లో ఆందోళన నెలకొంది.

Read More : 15 ఏళ్ల బాలుడి విమాన ప్రమాద మృతి