పాట్నా: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ( పీకే) పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడ్డారు. పీకే ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఇలా జరగడంతో అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ బీహార్ లోని ఆరా జిల్లాలో బడ్లావ్ సభకు రోడ్ షోగా వెళ్లారు. ఈ సమయంలో ఆయన పక్కటెముక భాగంలో నొప్పి రావడంతో ఇబ్బంది పడ్డారు. దీంతో, పీకే విలవిల్లాడిపోయారు. అనంతరం, వైద్య చికిత్స కోసం పీకేను పాట్నాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, ఆయన గాయంతో బాధపడుతూ నడవలేకపోతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది. కాగా, ఆరోగ్యం నిలకడగా ఉన్న తదనంతరం పీకే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

One thought on “పక్కటెముకల్లో తీవ్ర నొప్పితో విలవిల్లాడిపోయిన PK..”
Comments are closed.