టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు త్వరలోనే మరో కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు లగ్జరీ పెర్ఫ్యూమ్ మార్కెట్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించిన సమంత.. ఇప్పుడు సొంతంగా పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బ్రాండ్‌కు తనే అంబాసిడర్‌గా వ్యవహరించాలని, భారీ ప్రమోషన్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం సమంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ.
అభిమానులు మాత్రం సమంత కొత్త వ్యాపార ప్రయత్నానికి శుభాకాంక్షలు చెబుతూ.. “అభినేత్రిగా, నిర్మాతగా, ఇప్పుడు వ్యాపారవేత్తగా కూడా సమంత విజయాన్ని సాధించాలి” అంటూ ఆకాంక్షిస్తున్నారు.
ఈ వ్యాపార ప్రకటనకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.
Read More : ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు

One thought on “సమంత కొత్త వ్యాపార రంగంలోకి ఎంట్రీ”
Comments are closed.