‘సంభరాల యేటిగట్టు’ హోళీ స్పెషల్ పోస్టర్ విడుదల – సాయి దుర్గ తేజ్ కొత్త అవతారం!

Sambaraala Yetigattu Paints Carnage Red

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రధాన పాత్రలో రోహిత్ కె.పి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సంభరాల యేటిగట్టు’. ‘హనుమాన్’ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హోలీ సందర్భంగా, చిత్రబృందం స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో మొత్తం టీమ్ కలసి రంగుల పండుగను ఆనందోత్సాహంగా జరుపుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయితే, ఈ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్‌కు కొత్త షేడ్ – కార్నేజ్ రెడ్ అని చిత్రబృందం చెప్పుకొచ్చింది.

ఈ చిత్రంలో సాయి దుర్ఘ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌లో మాచో లుక్, ‘కార్నేజ్’ వీడియోలో ఆయన ఇచ్చిన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను గూస్‌బంప్స్‌కి గురి చేసింది.

ప్రస్తుతం, చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ఓ పాటను చిత్రీకరిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Read More



One thought on “‘సంభరాల యేటిగట్టు’ హోళీ స్పెషల్ పోస్టర్ విడుదల – సాయి దుర్గ తేజ్ కొత్త అవతారం!

Comments are closed.