ఉక్రెయిన్ భారీ యుద్ధనౌకపై రష్యా డ్రోన్ దాడి.

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆగడం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేసినా రష్యా తన దూకుడు తగ్గించలేదు. తాజాగా ఉక్రెయిన్ నౌకాదళానికి చెందిన భారీ యుద్ధనౌక ‘సింపరోపోల్’పై రష్యా సముద్ర డ్రోన్లతో దాడి చేసింది. ఒడెస్సా తీరంలో మోహరించి ఉన్న ఈ నౌకపై డ్రోన్ ఢీకొనడంతో భారీగా పేలుడు సంభవించింది. ఆ తర్వాత నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రష్యా దాడిని ఉక్రెయిన్ కూడా ధృవీకరించింది. ఈ దాడిలో ఒక నావికుడు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారని వెల్లడించింది. సముద్రంలో గల్లంతైన సిబ్బందిని రక్షించేందుకు శోధన, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.

2019లో ఉక్రెయిన్ నావికాదళంలో చేరిన ఈ భారీ నౌకను రష్యా డ్రోన్లు కూల్చివేయడం విశేషం. అదేవిధంగా, కీవ్‌లోని రెండు డ్రోన్ తయారీ కేంద్రాలపై కూడా రష్యా క్షిపణి దాడి జరిపిందని ఉక్రెయిన్ రాజకీయ నాయకుడు ఇగార్ జింకెవిచ్ వెల్లడించారు.

Read More : నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ లాబీయింగ్ అంతర్జాతీయ చర్చ.

One thought on “ఉక్రెయిన్ భారీ యుద్ధనౌకపై రష్యా డ్రోన్ దాడి.

Comments are closed.