హనుమకొండలో ఆర్టీసీ బస్సు బోల్తా – 15 మందికి గాయాలు.

జిల్లాలోని హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

ఒంగోలు నుండి ఆదిలాబాద్ వెళ్తున్న ఈ బస్సు తెల్లవారుజామున ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయంతో గాయపడ్డవారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

బస్సు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారిలో పలువురికి స్వల్ప గాయాలు కాగా, కొందరికి మధ్యమ స్థాయి గాయాలున్నాయని వైద్యులు వెల్లడించారు.

ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. బాధితులకు తగిన చికిత్స అందిస్తామని అధికారులు వెల్లడించారు.

Read More : ప్రేమ వివాహం నిరాకరణపై యువకుడు ఆత్మహత్య: మేడ్చల్ జిల్లా విషాద ఘటన