వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతూ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే. తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన, “అచ్చే దిన్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒకేరోజులో హ్యాట్రిక్ కొట్టింది” అంటూ తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం ఎల్‌పీజీ సిలిండర్ల ధరను పెంచడం, ఇంధనంపై అదనంగా రూ. 2 ఎక్సైజ్ సుంకం విధించడం తగదని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సెన్సెక్స్ పతనంపై కూడా కేటీఆర్ స్పందించారు. ఒక్కరోజులో రూ. 19 లక్షల కోట్ల విలువ గల్లంతవడం పై చురకలంటించిన ఆయన – “ఇది వాగ్దానం చేసిన అచ్ఛే దిన్‌కు సంకేతమా? లేక మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్ ప్రారంభమా?” అని కేంద్రంపై ప్రశ్నలు సంధించారు.

Read More : హనుమకొండలో ఆర్టీసీ బస్సు బోల్తా – 15 మందికి గాయాలు.

One thought on “కేంద్రం lpg సిలిండర్ ధర పెంపుపై కేటీఆర్ మండిపాటు..”
Comments are closed.