రోహిత్ ప్రాంక్‌కు రితిక షాక్‌..!

Rohit Sharma Ritika Love Story

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ – రితిక దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. రితిక క్రికెట్‌లో యాక్టివ్‌గా కనిపించకపోయినా, రోహిత్ మ్యాచ్‌ల్లో అప్పుడప్పుడూ అతడికి మద్దతుగా హాజరవుతూ అభిమానుల మనసులను గెలుచుకుంటున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రితిక, పెళ్లికి ముందు రోహిత్ ఇచ్చిన షాక్‌ను గుర్తు చేసుకుంది. “రోహిత్ చాలా సరదా మనిషి. మా పెళ్లికి ముందు ఒకసారి, నువ్వు వంట చేయలేకపోతే మా అమ్మ ఒప్పుకోదు అంటూ ఇంకా పెళ్లి వద్దని షాక్ ఇచ్చాడు. నిజంగా బాధతో ఏడ్చాను,” అని చెప్పింది.

అయితే ఇది రోహిత్ ప్లాన్ చేసిన ఒక సరదా ప్రాంక్ మాత్రమేనని ఆ తర్వాత తెలిసి హాయిగా నవ్వుకున్నట్లు రితిక చెప్పింది. అప్పటి నుంచి వీరి జీవితంలో ఇటువంటి సరదా ప్రాంక్స్ కామన్‌ అయిపోయాయని రితిక నవ్వుతూ గుర్తుచేసుకుంది.

కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తూ, తన కుమార్తెకి వన్యప్రాణులపై అవగాహన కల్పిస్తున్నారు రోహిత్ శర్మ. ఖాళీ దొరికినప్పుడల్లా రితిక, కుమార్తెతో కలిసి జూ సందర్శనలు చేస్తూ కుటుంబ జీవితం ఆస్వాదిస్తున్నారు.

Read More

One thought on “రోహిత్ ప్రాంక్‌కు రితిక షాక్‌..!

Comments are closed.