జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటనకు శ్రీకారం చుట్టింది. సీఎం బృందం తాజాగా జపాన్‌లోని నారిటా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ నెల 22వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

పర్యటనలో భాగంగా టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమా వంటి ప్రముఖ నగరాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. అంతేకాకుండా, ఒసాకాలో జరిగే వరల్డ్ ఎక్స్‌పో – 2025లో తెలంగాణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను సీఎం రేవంత్ అధికారికంగా ప్రారంభించనున్నారు.

జపాన్ పర్యటన సందర్భంగా అక్కడి ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి జపాన్ కంపెనీల భాగస్వామ్యం ఎంతగానో అవసరమని భావిస్తున్న సీఎం బృందం, ఈ పర్యటన ద్వారా కీలక ఒప్పందాలను సాధించే దిశగా ముందుకు సాగుతోంది.

Read More : Conocarpus చెట్లను నరికొద్దని వృక్ష శాస్త్రవేత్తలు అప్రమత్తం..