రాయచోటిలో మైనర్ బాలిక ఆత్మహత్య

రాయచోటిలో మైనర్ బాలిక ఆత్మహత్య కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ కార్యకర్త తారకరత్న ప్రేమ పేరుతో బాలికను వేధిస్తూ, ఇంట్లో చెబితే తండ్రిని హతమర్చేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఫోటోలు షేర్ చేస్తానని మరింత భయపెట్టిన కారణంగా బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇటీవల పదో తరగతి పరీక్షల్లో 554 మార్కులు సాధించిన ఈ బాలిక డాక్టర్ కావాలని లక్ష్యంగా ఇంటర్‌ చదివేందుకు కూడా అడ్మిషన్ తీసుకుంది. తల్లిదండ్రులు చాలా కష్టపడి ఆమె చదువు సాగించారని కుటుంబ సభ్యులు వాపోయారు.

“ప్రతిరోజూ మా అమ్మాయి వెనుక తిరుగుతూ, రోడ్డుపై ఆపి వేధింపులకు గురిచేసేవాడు. మేము BC వర్గానికి చెందినవాళ్లం. మా అమ్మాయిని ఎంతో కష్టపడి చదివించాం. ఆమె చావుకు కారణమైన వారిని శిక్షించేవరకు పోరాటం కొనసాగిస్తాం. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి,” అంటూ బాధిత బాలిక బాబాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Read More : అమరావతి నుంచి ఓ శుభవార్త!

One thought on “రాయచోటిలో మైనర్ బాలిక ఆత్మహత్య

Comments are closed.