తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్లో ఉంటోంది. ఇటీవల ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ స్టోరీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
అయితే, సినిమాల్లో బిజీగా ఉన్నా… సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సమీపంగా ఉంటూ తన వ్యక్తిగత అభిరుచులను పంచుకుంటోంది. తాజాగా రష్మిక షేర్ చేసిన స్టోరీలో, తాను వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి వాసనను ఎంతగానో ఇష్టపడతానని తెలిపింది. తాను ఉన్న ప్రాంతంలో పడిన వర్షాన్ని వీడియో తీసి షేర్ చేసిన రష్మిక, “వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన అంత అందమైనది మరొకటి ఉండదు. వర్షం వల్ల పనులన్నీ నెమ్మదిస్తాయ్ కానీ, ఆ వాసన నిజంగా ఫీలవ్వాల్సిందే” అని పేర్కొంది.
ఈ సింపుల్ అప్డేట్ ద్వారా రష్మిక ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఆమె అభిరుచులు మాత్రం సాధారణ మనుషులలానే ఉండేలా ఉన్నాయి అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Read More : బాలీవుడ్ హీరో ముకుల్ దేవ్ మృతి…

One thought on “సౌత్ స్టార్ రష్మిక మందన్నా తాజా స్టోరీ వైరల్”
Comments are closed.