Rashmika : పాన్ ఇండియా సినిమా ‘మైసా’ ప్రకటన

టాలీవుడ్, బాలీవుడ్ లలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రకటించింది. ఇటీవల ‘కుబేర’ చిత్రంతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన రష్మిక, తాజాగా ‘మైసా’ పేరుతో రూపొందనున్న ఓ పాన్ ఇండియా సినిమాలో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాకు రవీంద్ర పూలే దర్శకత్వం వహించనుండగా, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు మరికొన్ని భారతీయ భాషల్లో ఈ సినిమా భారీగా విడుదల కానుంది. మైసా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం… ‘‘ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి’’ అనే పదాలతో సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. పోస్టర్‌లో రష్మిక యోధురాలా, విభిన్నమైన పాత్రలో కనబడటం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ… ‘‘నేను ఎప్పుడూ కొత్తగా ఉండే కథలను ఎంచుకుంటాను. ‘మైసా’ ఒక ప్రత్యేకమైన ప్రయాణం. ఇది నాకు కొత్త ప్రపంచం, కొత్త పాత్ర. చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే’’ అని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం రష్మిక కెరీర్ మంచి ఊపులో ఉంది. ‘కుబేర’ ఘనవిజయం సాధించగా, ఆమె ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ, ఆయుష్మాన్ ఖురానాతో ‘థామా’ అనే అతీంద్రియ ప్రేమ కథా చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇప్పుడు ‘మైసా’ ప్రాజెక్ట్‌తో ఆమెకు మరో భారీ సినిమా జోడైంది.

ఈ సినిమాతో రష్మిక తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరనున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Read More : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కు కుడి చేతికి గాయం

One thought on “Rashmika : పాన్ ఇండియా సినిమా ‘మైసా’ ప్రకటన

Comments are closed.