రణ్వీర్ సింగ్ సినిమా షూటింగ్‌లో ఫుడ్ పాయిజనింగ్

బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ సినిమా షూటింగ్‌లో ఫుడ్ పాయిజనింగ్ ఘటన కలకలం రేపింది. ప్రొడక్షన్ యూనిట్ కోసం సిద్ధం చేసిన ఆహారం వికటించడంతో 100 మందికి పైగా సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మొత్తం 600 మంది సిబ్బందికి ఇదే భోజనం వడ్డించారు. వారిలో 100 మంది తీవ్రంగా అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. మరో 200 మంది స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. అయితే, వారికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించి పంపించేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Read More : జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలను సన్మానించిన సీఎం

One thought on “రణ్వీర్ సింగ్ సినిమా షూటింగ్‌లో ఫుడ్ పాయిజనింగ్

Comments are closed.