రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న 90 ఏళ్ల ఒంటరి వృద్ధురాలిపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం ప్రకారం, రోజువారీలా ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఒక 25 ఏళ్ల యువకుడు తలుపు తట్టి నిద్రలేపాడు. అనంతరం విచక్షణారహితంగా దాడి చేసి అత్యాచారం చేసి అక్కడి నుండి పరారయ్యాడు.
తిరగబడే శక్తి కూడా లేని వృద్ధురాలు తీవ్ర రక్తస్రావంతో ఉన్నారు. ఉదయం పని మనిషి వస్తే తలుపు తెరిచి రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధురాలిని చూసి షాక్‌కు గురైంది. వెంటనే పక్కింటి వారిని సమాచారం అందించింది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇలాంటి దారుణ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Read More : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో విచారణ వేగం

One thought on “90 ఏళ్ల వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం”
Comments are closed.