ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్‌జీవీ) ఇవాళ ఉదయం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్‌బాబు నిన్ననే నోటీసులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌ల ఫొటోలు మార్ఫింగ్ చేసిన కేసులో ఈ విచారణ జరుగుతోంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ మార్ఫింగ్ చేసి నాయకులను కించపరిచినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో వర్మపై కేసు నమోదైంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 7న వర్మ ఒకసారి విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు మళ్లీ ఆయన విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆర్‌జీవీని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్‌బాబు ప్రశ్నిస్తున్నారు.
Read More : రామ్ గోపాల్ వర్మపై కేసు విచారణ

One thought on “రామ్‌గోపాల్ – ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో హాజరు”
Comments are closed.