రామ్ చరణ్ ప్రశంసలతో మూవీ చిత్ర బృందం ధన్యమవుతోంది!

నాని, శైలేష్ కొలను కాంబినేషన్‌లో వచ్చిన హిట్-3 సినిమా ఘన విజయం సాధిస్తూ, బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మే 1న విడుదలైన ఈ చిత్రం, నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

హిట్-3 సినిమాను గురించి వినిపిస్తున్న అద్భుతమైన సమీక్షలు తనను ఎంతో ఆనందపర్చాయని రామ్ చరణ్ తెలిపారు. సినిమాకు సహకరించిన మొత్తం బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తన ఆత్మీయ స్నేహితుడు నాని విభిన్న కథాంశాలను ఎంచుకుని ప్రతిసారి సరికొత్త ప్రయోగాలతో ముందుకెళ్తూ విజయాలను సాధిస్తున్నాడని కొనియాడారు.

దర్శకుడు శైలేష్ కొలను రచన, దర్శకత్వ ప్రతిభను ప్రశంసిస్తూ, “ఈ ఉత్కంఠభరిత చిత్రాన్ని అద్భుతంగా రాసి, అంతే ప్రతిభతో తెరపైకి తీసుకొచ్చినందుకు హ్యాట్సాఫ్” అని రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు.ఈ విజయంలో భాగస్వాములైన నటి శ్రీనిధి శెట్టి, నిర్మాత ప్రశాంతి తిపిర్నేని, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ టీమ్‌లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. హిట్-3 సినిమాను చూసిన ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందనకు చిత్ర బృందం ఉత్సాహంతో ఉంది.

Read More : శ్రీయా సరన్‌కు కెరళలో మరిచిపోలేని సెలవులు!

One thought on “రామ్ చరణ్ ప్రశంసలతో మూవీ చిత్ర బృందం ధన్యమవుతోంది!

Comments are closed.