హనుమాన్ జయంతికి మెగా గిఫ్ట్: విష్వంభర ఫస్ట్ సింగిల్ ప్రోమో

Ramaramma Promo from Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పౌరాణిక ఫాంటసీ చిత్రం ‘విష్వంభర’ నుంచి ప్రమోషన్స్ జోరు మొదలైంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని చిత్రబృందం ‘రామరామా’ ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఎం.ఎం.కీరవాణి అందించిన మ్యూజిక్‌ ప్రోమోతోనే పాజిటివ్ వైబ్స్‌ కలిగిస్తోంది. పూర్తి పాటను ఏప్రిల్ 12 ఉదయం 11:12కి రిలీజ్ చేయనున్నారు.

ప్రోమోలో చిరంజీవి చిన్నారులతో కలిసి హనుమంతుడు గెటప్‌లో ఉన్న కిడ్స్ మధ్య కనిపించడం హైలైట్‌గా నిలిచింది. 1980-90ల చిరు ఎనర్జీని గుర్తుచేస్తూ మెగాస్టార్ స్క్రీన్‌పై తనదైన స్పార్క్ చూపించారు. శంకర్ మహాదేవన్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించగా, శోభి మాస్టర్-లలిత మాస్టర్‌లు కొరియోగ్రఫీ అందించారు.

చడమే కాక, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన సంస్కృతిక భావాన్ని కలిగించేలా రూపొందినట్టు తెలుస్తోంది. దర్శకుడు వశిష్ఠ విజువల్ ఫాంటసీకి కొత్త నిర్వచనాన్ని తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. ‘బింబిసార’ తర్వాత అతని విజన్ మరింత మైథలాజికల్ యూనివర్స్‌గా విస్తరిస్తోందని అర్థమవుతోంది.

‘రామరామా’ ప్రోమోతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది. అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ప్రోమోను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. పూర్తి పాట విడుదల అనంతరం మిగతా పాటలపై ఆసక్తి పెరిగేలా ఉంది. మొత్తం మీద, కీరవాణి సంగీతం మాయచేస్తున్న ‘విష్వంభర’ తన మ్యూజికల్ జర్నీని శక్తివంతంగా మొదలుపెట్టింది.

Read More

One thought on “హనుమాన్ జయంతికి మెగా గిఫ్ట్: విష్వంభర ఫస్ట్ సింగిల్ ప్రోమో

Comments are closed.