సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు చేసే వారిపై నటి రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇతరులను బాధపెట్టడమే పనిగా చేసుకునే పనికిమాలిన వాళ్లు దేశంలో పెరిగిపోయారని ఆమె వ్యాఖ్యానించారు. “పనీపాట లేకపోవడం, ఫ్రీ డేటా కారణంగా కొంతమంది సోషల్ మీడియాలో నెగటివిటీని వ్యాప్తి చేస్తున్నారు. ఇతరులపై కామెంట్లు పెడుతూ ఆనందిస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై దుష్ప్రచారం చేయడం, వారిని బాధపెట్టడమే కొందరి పని అయిపోయింది. దేశంలో పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు” అని రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారగా, నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది రకుల్‌కు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.
టాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన రకుల్, తాజాగా నటించిన ‘మేరే హస్బెండ్ కి బివి’ చిత్రం విడుదలైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు అంశాలపై స్పందిస్తున్న ఆమె, ట్రోలింగ్ చేసే వారిని కౌంటర్లతో సమాధానమిస్తున్నారు.

One thought on “సోషల్ మీడియా ట్రోల్స్‌పై రకుల్ ఆగ్రహం”
Comments are closed.