కె ర్యాంప్‌పై కిరణ్ అబ్బవరం ఫోకస్!

Rakul Preet Singh pregnancy rumors

యువ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో “క” సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. వరుసగా సినిమాలు చేసినప్పటికీ విజయాల విషయంలో కొంత వెనుకబడ్డాడు. అయినా “క” సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఊపుతో “దిల్ రూబా” అనే చిత్రం తీసుకురావడమే కాక, ప్రమోషన్‌లోనూ పూర్తి స్థాయిలో దూసుకెళ్లాడు. “క” సక్సెస్ కారణంగా ప్రేక్షకుల అంచనాలు పెరిగినా, “దిల్ రూబా” మాత్రం నిరాశనే మిగిల్చింది. ఈ చిత్రం అసలు “క” కన్నా ముందే పూర్తైనప్పటికీ, హిట్ ఫాలోప్ కోసం తరువాతే విడుదల చేశారు.

ఈ ఫలితంతో కిరణ్ మళ్లీ ట్రాక్ తప్పినట్టు కనిపించినా, ఇప్పుడు “కె ర్యాంప్” అనే సినిమాతో రీబౌన్స్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని జైన్స్ నాని దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాత రాజేష్ దండ. ఇందులో కిరణ్ సరసన యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది. గతంలో నాగ శౌర్యతో చేసిన “రణబలి” తర్వాత యుక్తికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో ఆమెకి ఈ సినిమా రూపంలో మరో అవకాశమొచ్చింది.

“కె ర్యాంప్” విషయంలో కిరణ్ పూర్తిగా తన మార్క్ ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడని సమాచారం. కథను బలంగా ఎంచుకుని, దానికి తగినట్టుగా స్క్రీన్‌ప్లే ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ప్రమోషన్స్‌కూ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. సినిమా ప్రారంభం నుంచే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కలిసి ఫన్ ఫుల్ అనౌన్స్‌మెంట్‌తో హైప్ క్రియేట్ చేశారు. మరి జైన్స్ నాని – కిరణ్ అబ్బవరం కాంబోలో వస్తున్న ఈ “కె ర్యాంప్” వాస్తవంగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ర్యాంప్‌ ఆడిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Read More