నాని ‘ది ప్యారడైజ్’ స్టన్నింగ్ లుక్!

నేచురల్ స్టార్ నాని, “దసరా” ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం “ది ప్యారడైజ్” ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. మ్యాడ్ మ్యాక్స్ శైలి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానున్నందున, ప్రేక్షకులు, అభిమానులు ప్రతి కొత్త అప్డేట్‌ కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

తాజాగా విడుదలైన నాని లుక్ పోస్టర్ ఈ అంచనాలను మరింత పెంచింది. మిషన్ గన్‌తో, వర్షాన్ని తట్టుకుంటూ నిలబడి ఉన్న నాని పాండి యాక్షన్ హీరోగా కనిపిస్తున్న ఈ లుక్ చిత్రానికి కొత్త ఇంటెన్సిటీని చేకూర్చింది. 1980ల కాలం ఆధారంగా, మ్యాడ్ మ్యాక్స్ శైలి ఈ చిత్రం విజువల్ మాసివ్ అనుభవాన్ని అందించబోతున్నట్లు సంకేతం ఇస్తుంది.

“ది ప్యారడైజ్” చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ పతాకంపై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 110-120 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి విజువల్‌గా సమృద్ధిగా ఉండేలా ఈ చిత్రానికి పెద్ద బడ్జెట్‌ను కేటాయించారు. అన్ని భాషలలో విడుదల చేయబడనున్న ఈ చిత్రం, బిజినెస్ పరంగా కూడా భారీ ఆశలు కలిగిస్తోందని టాక్.

ఇటీవల ఈ చిత్ర విడుదల తేదీపై కొన్ని గాసిప్స్ వినిపించాయి. 2026 మార్చి 26న, రామ్ చరణ్-బుచిబాబు దర్శకత్వంలో మరో భారీ చిత్రం విడుదల కావచ్చు అని ప్రచారం జరిగింది. అయితే, మేకర్స్ ఆ గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టారు. “365 రోజులు” అనే నాని కొత్త పోస్టర్‌తో “ది ప్యారడైజ్” యొక్క అధికారిక విడుదల తేదీని మరోసారి 2026 మార్చి 26 అని ప్రకటించారు.

Read More