74 ఏళ్లకూ రజనీ మేనియా..! యంగ్ హీరోలకే సవాల్

Lokesh kanakaraj and Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ 74 ఏళ్ల వయసులోనూ వరుసగా భారీ యాక్షన్‌, బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఒకప్పుడు కోలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసిన రజనీ, కొంత విరామం తర్వాత మళ్లీ వేగంగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో ముందుకు సాగుతున్నారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ’ సినిమా షూటింగ్ పూర్తయింది. లోకేష్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, రజనీకాంత్‌తో పని చేయడం గొప్ప అనుభవమని తెలిపారు. ‘కూలీ’ పూర్తైన వెంటనే రజనీ ‘జైలర్ 2’ సెట్స్‌లో అడుగుపెట్టారు.

ఇటీవల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘జైలర్ 2’ షూటింగ్ ప్రారంభమైంది. నెల్సన్ దిలీప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ‘కూలీ’ షూటింగ్ ముగిసిన వెంటనే, రజనీ ఎలాంటి విరామం లేకుండా ‘జైలర్ 2’ సెట్స్‌లో పాల్గొనడం ఆయన ఎనర్జీకి నిదర్శనం.

ఈరోజుల్లో చాలా మంది యంగ్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమాను కూడా పూర్తిచేయలేకపోతున్నారు. కానీ 74 ఏళ్ల రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వారికే పోటీగా నిలుస్తున్నారు. ఈ ఏడాదిలో రెండు సినిమాలతో రానుండగా, వచ్చే ఏడాదికైనా మరిన్ని ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి.

సినిమాల ఎంపిక, ఎనర్జీ, డెడికేషన్‌లో రజనీకాంత్ నిజంగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి.

Read More



One thought on “74 ఏళ్లకూ రజనీ మేనియా..! యంగ్ హీరోలకే సవాల్

Comments are closed.