సూపర్‌స్టార్ రజనీకాంత్ 171వ సినిమాగా రూపొందుతున్న కూలీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతోనే తొలిసారిగా రజనీకాంత్, లోకేష్ కానగరాజ్ కాంబినేషన్ తెరపైకి రానుండడం ప్రేక్షకుల్లో భారీ అంచనాలకు దారి తీసింది. ఈ చిత్రానికి సంబంధించి విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించగా, తాజాగా దర్శకుడు చేసిన కామెంట్లు మరింత హైప్‌ను పెంచాయి.
తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న లోకేష్ కానగరాజ్‌ను కూలీ సినిమాలో రజనీ పాత క్లాసిక్ సీన్స్‌ను తిరిగి తీసారా అని అడిగారు. అయితే దీనిపై ఆయన స్పందిస్తూ, “మేము ప్రత్యేకంగా ఏ సీన్‌ను రీక్రియేట్ చేయలేదు. కానీ రజనీ గారి పాత సినిమాలకు సంబంధించిన కాల్‌బ్యాక్‌లు, రిఫరెన్స్‌లు తప్పకుండా ఉంటాయి,” అని చెప్పారు. ఇక తన సినిమాల్లో కనిపించే ఫుడ్ రిఫరెన్స్‌లు ఈ సినిమాలోనూ ఉంటాయని కూడా వెల్లడించారు.
ఆగస్ట్ 14, 2025న విడుదలవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజనీకాంత్ విభిన్న షేడ్‌తో కనిపించనున్నారని టాక్. కేవలం హీరోగా కాదు, కొద్దిగా నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్‌లోనూ ఉండనుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇందులో నాగార్జున అక్కినేని, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, షౌబిన్ షాహిర్ వంటి తారాగణం కీలక పాత్రలు పోషించనున్నారు. ఇదే సమయంలో హృతిక్ రోషన్ నటించిన వార్ 2తో కలిసే విడుదల కానుండడంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ జరిగే అవకాశం ఉంది.
One thought on “‘కూలీ’లో రజనీ పాత సీన్లకు రిఫరెన్స్‌లు.. లోకేష్ కనగరాజ్ క్లారిటీ!”
Comments are closed.