బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత పరమ చెత్త సినిమా అంటూ ప్రేక్షకులు “లక్ష్మీ” చిత్రాన్ని విమర్శిస్తున్నారు. 2020లో విడుదలైన ఈ హారర్ కామెడీ డ్రామా థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై, దానికి తగిన రెస్పాన్స్‌ను పొందలేదు.
ఈ సినిమా విడుదలై దాదాపు 5 సంవత్సరాలు పూర్తయినా, ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. IMDBలో కూడా “లక్ష్మీ” చిత్రానికి తక్కువ రేటింగ్ వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో కూడా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది, తర్వాత ఓటీటీలో విడుదలైనప్పటికీ, ప్రేక్షకులలో ఎటువంటి ఆసక్తి కలగలేదు.
“లక్ష్మీ” చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన “కాంచన” చిత్రానికి హిందీ రీమేక్. అయితే, హిందీ భాషలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అక్షయ్ కుమార్ ఇందులో ఆసిఫ్ పాత్రలో నటించాడు, కాగా కియారా అద్వానీ రష్మి పాత్రలో కనిపించింది.
ఈ చిత్రం సృష్టించిన హైప్‌ను అందుకోలేకపోయింది. IMDM ప్రకారం, “లక్ష్మీ” సినిమా బాలీవుడ్ చెత్త చిత్రాల జాబితాలో చేరింది.

One thought on “బాలీవుడ్ డిజాస్టర్‌గా నిలిచిన ‘లక్ష్మీ’ చిత్రం: 5 సంవత్సరాల తర్వాత కూడా ఆసక్తి లేని సినిమా”
Comments are closed.